
ఆర్థిక భారం మిగిల్చిన విషాదం
కర్ణాటక రాష్ట్రం హోస్కోటే సమీపంలోని గోనకనహల్లి గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో కష్టపడుతున్న ఒక కుటుంబం చివరికి దారుణ నిర్ణయం తీసుకుంది. పేదరికం, రుణబాధలు , వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కారణంగా దంపతులు ఇద్దరు తమ ఇద్దరు చిన్నపిల్లలను చంపి, ఆపై భార్యాభర్తలిద్దరు ఆత్మహత్య యత్నం చేసారు.
పోలీసుల వివరాల ప్రకారం 32 ఏళ్ల శివకుమార్ అనారోగ్య సమస్యల కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య మంజుల (30) కూలి పనులు చేస్తూ ఇంటిని నడిపించేది. ఈ క్రమంలో అప్పులు ఎక్కువవడం వల్ల ఆర్థిక భారం తట్టుకోలేక దంపతులిద్దరూ తమ ఇద్దరు పిల్లలను చంపి వారు కూడా చనిపోవాలని అనుకున్నారు.అయితే ప్లాన్ ప్రకారం ముందుగా తన కుమార్తె చంద్రకళ (11) ను గొంతు నులిమి చంపి తరువాత తమ కుమారుడు ని సైతం అదేవిదంగా హతమార్చారు.
అనంతరం శివకుమార్, అతని భార్య మంజుల చనిపోవడం కంటే ముందు చివరి సరిగా మద్యం తాగాలని అనూకున్నారు అందుకు మంజులను స్నేక్స్ కోసం షాప్ కి పంపాడు. మంజుల షాప్ కి వెళ్లి వచ్చేసరికి శివకుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసిన మంజుల తాను చనిపోవాలని నిర్ణయించుకుంది అంతకంటే ముందు తన తల్లిదండ్రులతో చివరిసారి మాట్లాడాలనుకుంది. తన ఫోన్ పనిచేయకపోవడంతో పక్కింటివారి ఫోన్ తీసుకుని తండ్రికి విషయం చెప్పి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది గమనించిన పక్కింటి వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఆపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న మంజులను రక్షించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు పిల్లలు, భర్త మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. మంజులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
