Let's talk: editor@tmv.in
ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ పునః స‌మీక్షించాలి

ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ పునః స‌మీక్షించాలి

Venkatesh Balusula
22 సెప్టెంబర్, 2025

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పుట్టపాక గ్రామ రైతులు ఎదుర్కొంటున్న రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ సమస్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పరిశీలించారు. ఈ సమస్యను వివరిస్తూ రైతులు ప్రస్తుత రోడ్డు మార్గం వల్ల తమ పంట భూములకు నష్టం జరుగుతోందని, ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న బీడు, కొండ భూములను వినియోగిస్తే పంట భూములను రక్షించవచ్చని సూచించారు. స్థానికంగా చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉండటంతో జీవనోపాధి ప్రమాదంలో పడుతోందని రైతులు వాపోయారు. త‌మ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే విధంగా ప్ర‌భుత్వంతో చ‌ర్చించాల‌ని కోరుతూ రైతులు రాంచంద‌ర్ రావుకు విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. రైతుల ఆవేదనపై స్పందించిన రాంచందర్ రావు రైతుల భూములు, జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ కర్తవ్యమన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలైన్‌మెంట్ పునః సమీక్షించి రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ పునః స‌మీక్షించాలి - Tholi Paluku