
ఆయుధ అక్రమ రవాణా గ్యాంగ్ గుట్టు రట్టు
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తాజాగా ఒక పెద్ద ఆయుధ అక్రమరవాణా గ్యాంగ్ గుట్టు రట్టు చేసింది. పెద్ద ఎత్తున ఆయుధాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా 15 సెమీ ఆటోమాటిక్ పిస్టల్స్, 150 లైవ్ రౌండ్స్, 8 అదనపు మాగజైన్లు స్వాధీనంచేసినట్టు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు ప్రసిద్ధి చెందిన “నీరజ్ బవానా” గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) హర్ష్ ఇంద్రా మాట్లాడుతూ, ఈ పట్టుబాటు ఢిల్లీ ( యాన్ సి ఆర్) లో అక్రమ ఆయుధాల సరఫరాను అడ్డుకోవడంలో ఒక పెద్ద విజయంగా నిలుస్తుందని తెలిపారు.ప్రధాన నిందితుడు మొహమ్మద్ షాజిద్ (42) పలుమార్లు ఇటువంటి క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడని అంతేకాక 2012లో రెండు రాబరీ, డాకిటీ కేసులో అరెస్ట్ ఇవ్వడమేకాక 2022లో ఆయుధ చట్టం మిషన్ టు మర్డర్ కేసుల్లో నిందితుడైన ప్పటికీ, విడుదల తర్వాత తిరిగి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడని అధికారులు తెలిపారు.
ఇక షాజిద్ను నేటాజీ సుభాష్ ప్లేస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్, మవానా ప్రాంతాల నుండి ఆయుధాలను సేకరించి, నీరజ్ బవానా గ్యాంగ్, అఫ్సర్ గ్యాంగ్, ఇతర క్రిమినల్ సిండికేట్లకు సరఫరా చేశాడని తెలిపాడు. ఒక్కో ఆయుధాన్ని 35,000 నుండి 40,000 రూపాయలకు కొనుగోలు చేసి 60,000 రూపాయలకు అమ్మి లాభం పొందినట్లు వివరించారు.
షాజిద్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు రీసీవర్లు విషాల్ రానా (28, ఇండర్పురి), అనికేత్ (32, రజోరి గార్డెన్), సౌరభ్ దింగ్రా (38) లను అదుపులోకి తీసుకున్నారు.అయితే వీరి వద్ద కూడా పిస్టల్స్, లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే అక్రమ ఆయుధ కేసులలో నేర చరిత్ర ఉన్నవారే. అదేవిదంగా ఈ నెట్వర్క్ ద్వారా 100 పైగా ఆయుధాలు క్రిమినల్స్కు సరఫరా చేయబడ్డాయి. అధికారులు ఇంకా ఇతర సప్లయర్లను గుర్తించి నెట్వర్క్ను పూర్తిగా నాశనం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
