
ఆన్‌లైన్ షాపింగ్ మోసాల నుంచి ఇలా జాగ్రత్త పడండి..!!
ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చాలా పెరిగింది. ఇది ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో, అంతే మోసాలకు కూడా అవకాశం ఇస్తుంది. కొందరు మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్లు, అవాస్తవిక ఆఫర్లతో అమాయకులను మోసం చేస్తుంటారు. ఈ స్కామ్స్ నుండి సేఫ్ గా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
ఫేక్ వెబ్‌సైట్లను గుర్తించండి
ముందుగా, మీరు షాపింగ్ చేయాలనుకునే వెబ్‌సైట్ ఫేక్ దా కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫేక్ సైట్లు సాధారణంగా నమ్మశక్యం కాని ఆఫర్లను ప్రకటిస్తాయి. ఉదాహరణకు, ఒక సాధారణ ధర కంటే చాలా తక్కువ ధరకి ఏదైనా వస్తువు లభిస్తే అది మోసానికి సంకేతం కావచ్చు. అంతేకాకుండా, వెబ్‌సైట్ అడ్రస్ (URL) లో https:// ఉందో లేదో, అలాగే బ్రౌజర్ అడ్రెస్ బార్ లో ప్యాడ్‌లాక్ సింబల్ ఉందో లేదో గమనించండి. ఇవి మీ డేటా సేఫ్ గా ఉందని సూచిస్తాయి. ఇంకా, గ్రామర్ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నా, లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ సరిగ్గా లేకపోయినా ఆ వెబ్‌సైట్ ఫేక్ ది అయ్యే అవకాశం ఉంది.
రివ్యూలు, స్పెసిఫికేషన్స్ చెక్ చేయండి
మీరు కొనుగోలు చేయాలనుకునే వస్తువు గురించి ఇతరుల రివ్యూలు చదవడం చాలా అవసరం. తక్కువ రివ్యూలు ఉన్నా, లేదా అన్ని రివ్యూలు చాలా గొప్పగా ఉన్నా అనుమానించాలి. ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ క్లియర్ గా లేని సెల్లర్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతర రిటైలర్లతో ధరలను కంపేర్ చేయడం మంచిది. ఒకవేళ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ అని, లేదా టైం తక్కువ అని తొందర పెడుతుంటే అప్పుడు జాగ్రత్త పడండి.
నమ్మకమైన ప్లాట్‌ఫారమ్స్ వాడండి
ఫేక్ వెబ్‌సైట్లు కస్టమర్ కేర్ సపోర్ట్ సరిగ్గా ఇవ్వవు. వారికి సంబంధించిన రీఫండ్, రిటర్న్ పాలసీలు క్లియర్ గా ఉండవు. కాబట్టి పేరున్న, నమ్మకమైన వెబ్‌సైట్లను మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. మీకు తెలియని సైట్ల నుంచి వచ్చే ప్రమోషనల్ యాడ్స్ లేదా పాప్-అప్స్ పై క్లిక్ చేయకుండా ఉండాలి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ మీకు సజెస్ట్ చేసిన సైట్ల నుంచి షాపింగ్ చేయండి.
సేఫ్ పేమెంట్ మెథడ్స్ వాడండి
సురక్షితమైన పేమెంట్ మెథడ్స్ ఉపయోగించడం చాలా అవసరం. క్రెడిట్ కార్డ్స్ లేదా Google Pay, Apple Pay వంటి డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లించడం సేఫ్. మీ బ్యాంక్ డీటెయిల్స్ ను నేరుగా తెలియని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయకుండా ఉండటం మంచిది. అలాగే, పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లలో ఆన్‌లైన్ పర్చేసెస్ చేయకుండా ఉండండి. ఎందుకంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగిలించబడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్స్ నుండి సేఫ్ గా ఉండవచ్చు.
