
ఆదివాసుల సమస్యలు పట్టవా?
తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో భవనాలు నిర్మిస్తుంది తప్ప ఆదివాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అభివృద్ధి అంటే ఖాళీ భవనాలు కాదని, మనిషి మనుగడ అని పేర్కొన్నారు. ఈ విషయం మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, అప్పుడు అసలైన ప్రగతి మొదలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫోర్త్ సిటీల పేరుతో వేల ఎకరాల అడవులను తొలగిస్తూ, అక్కడ దశాబ్దాలుగా జీవిస్తున్న ఆదివాసీ ప్రజలను నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రవీణ్ కుమార్ ప్రభుత్వని ప్రశ్నించారు.
‘మన ఆసిఫాబాద్ జిల్లా ప్రకృతితో మమేకమైన జీవన శైలికి ప్రతీక. అక్కడి గిరిజనులు వనాలను తమ తల్లిగా భావించి, దాని రక్షణకే జీవనం అంకితం చేస్తారని తెలిపారు. అలాంటి మనుషుల పట్ల మనం కనీస గౌరవం చూపించకపోతే, మనుషుల్లేని కాంక్రీట్ నగరాలు ఎందుకు అవసరం అన్నారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అడల్ ప్రాజెక్ట్ పెద్ద చెరువులో నీరు ఉంటే కెనాల్ కాలువలో నీరు ఉండేది.కాని ఈ అడల్ చెరువులో నీరు వెళ్ళాలంటే కెనాల్ కాలువలు పునరుద్దికరణ చేయడం వల్ల ఆసిఫాబాద్ మండల గిరిజన ప్రజలకు పంటలకు నీరు ఇక్కడి నుంచే వెళ్ళాలి ,కాని ప్రభుత్వం కెనాల్ కాలువలను పునరుద్దికరణ చేయడంలేదని గిరిజనజాతి ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు‘ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
అలాగే ప్రతి రూపాయి పథకాలు, రోడ్లు, బిల్డింగులకు వెచ్చించేముందు – ఆ పథకాలు ఎవరికోసం అనేది ఆలోచించాల్సిన సమయం ఇదని తెలిపారు. గిరిజన పిల్లల విద్య, వారి ఆరోగ్యం, వారి భూముల భద్రత, వారి భవిష్యత్ కలలు ఇవే నిజమైన అభివృద్ధికి ఆధారాలు కావాలన్నారు.
ఆసిఫాబాద్ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా, టెండర్ల పరంగా ప్రాజెక్టులు వేయడం అభివృద్ధి కాదని, ఆ ప్రాజెక్ట్ లను మధ్యలో అపడం జరుగుతుందన్నారు.మనుషులు లేని సిటీ కంటే, మనసున్న సమాజం మేలైనదని తెలిపారు.ప్రతి గిరిజన కులపెద్ద మనిషి గొంతు వినిపించేలా, న్యాయం జరిగేలా మనం కృషి చేయాలి. అభివృద్ధి అన్నది పునాదుల్లోనూ, మనుషుల్లోనూ ఉండాలి కాంక్రీట్ కట్టడాల్లో కాదని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు.
