Let's talk: editor@tmv.in
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. మూడు ప్రాణాలు కబళించిన ప్రమాదం

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. మూడు ప్రాణాలు కబళించిన ప్రమాదం

Panthagani Anusha
20 సెప్టెంబర్, 2025

ప్రయాణికులు తమ వాహనంలో ఎక్కారంటే ఆ డ్రైవర్ వెయ్యి కళ్లతో రోడ్డుపై ముందు, వెనుక నిశితంగా గమనిస్తూ వాహనాన్ని నడపాలి. డ్రైవర్ నిర్లక్ష్యం విషాదానికి దారి తీస్తుందో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తుల్జాభవాని తాండాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్పష్టం చేసింది.

వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలానికి చెందిన నర్సింహ అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో ముగ్గురు ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకొని నిర్లక్ష్యంగా వాహనం నడుపుతుండటంతో ఎదురుగా వస్తున్న కూల్‌డ్రింక్స్ ట్రాలీని గమనించలేదు. ఆటోను అకస్మాత్తుగా మలుపు తిప్పడంతో ఎదురుగా వేగంగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టాడు. వాహనాలు ఢీకొన్న వేగానికి ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు నర్సింహరెడ్డి (56), వంశీ (23), పట్లావత్ సాక్రి (34) అక్కడికక్కడే మృతి చెందారు.డ్రైవర్ నర్సింహులుకు స్వల్పగాలు కాగా మరో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఇక గాయపడ్డ ఆటో డ్రైవర్ నరసింహులు ఘటనా స్థలం నుండి పరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు.

మరోవైపు కేసు విచారణలో భాగంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు వంశీ ఖిల్లాఘనపూర్ మండలం గట్టుకాడిపల్లి గ్రామానికి చెందివాడిగా గుర్తించారు, వృత్తి రీత్యా రోజూవారీ కూలీగా పని చేస్తున్నాడని, మృతురాలు పట్లావత్ సాక్రి తన ఇద్దరు కూతుళ్లను హాస్టల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు చేతికి అందివచ్చిన కొడుకు తమ కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఒక్కరి నిర్లక్ష్యం ముగ్గురి కుటుంబాల్లో శాశ్వత విషాదాన్ని నింపింది. మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి మాట్లాడుతూ నిందితుడు నరసింహాను అదుపులోకి తీసుకున్నామని, తగిన శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. మూడు ప్రాణాలు కబళించిన ప్రమాదం - Tholi Paluku