Let's talk: editor@tmv.in
ఆగిన విద్యార్థి గుండె

ఆగిన విద్యార్థి గుండె

FL - YUGDR
19 సెప్టెంబర్, 2025

ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పాలవలస సాయికిరణ్ (19) అస్వస్థతతో గురువారం మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన సాయికిరణ్ స్థానిక సీతం కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఎన్సీసీపై మక్కువతో సాయికిరణ్ గురువారం జరిగిన ఎంపికలో పాల్గొన్నారు. ఈ ఎంపికలో భాగంగా 1.6 కిలోమీటర్లు పరుగులో పాల్గొన్న సాయికిరణ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం, ఎన్సీసీ సిబ్బంది హుటాహుటిన కారులో జీజీహెచ్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తుండగా సాయికిరణ్ మృతి చెందాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సాయికిరణ్ తండ్రి పోలినాయుడు ఎన్నో ఆశలతో తన కుమారుడిని ఇంజనీరింగ్ చదివించి ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు. కానీ ఆశలు ఆవిరైపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి తల్లి సుజాత, అక్క శ్రావణి ఉన్నారు.

ఆగిన విద్యార్థి గుండె - Tholi Paluku