
అస్సాంలో ప్రపంచకప్ జరగడం గర్వంగా ఉంది
మహిళల ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ ను అస్సాంలో నిర్వహిస్తుండడం గర్వంగా ఉందని సోమవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. అయితే దుర్గా పూజలు ఉన్నందున, ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వలన ఈ మ్యాచ్ కు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచకప్ గౌహతిలో ప్రారంభం కానుండడం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మాకెంతో గర్వకారణంగా ఉందన్నారు. అయితే ఐసీసీ మహిళల ప్రపంచకప్ సెప్టెంబర్ నుంచి నవంబర్ 2 వరకు ఇండియా, శ్రీలంక వేదికగా జరగనున్నాయి.
ముఖ్యమంత్రి శర్మ గౌహతిలోని పండల్‌లో దుర్గా పూజకు హాజరయ్యారు. అక్కడ ఆయన జలుక్‌బరి నియోజకవర్గంలోని ధరాపూర్‌లో ఇటీవల మరణించిన సింగర్ జుబీన్ గార్గ్ చిత్రపటానికి నివాళులర్పించి తన పూజ మండపాల సందర్శనను ప్రారంభించారు. ఈ నవరాత్రి కాలంలో జలుక్‌బరి నియోజకవర్గంలో మొత్తం 29 పూజల్లో పాల్గొననున్నారు. సోమవారం నవరాత్రిలో ఏడవ రోజు కావడంతో వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. అలంకరణలతో మండపాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పూజ మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి.
జుబిన్ మరణం వెనుక కుట్ర
ప్రముఖ గాయకుడు జుబీన్ మరణం వెనుక కుట్ర ఉందని సీఎం ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, దీని వెనుక ఎవరున్న కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై చాలా లోతుగా ప్రత్యేక దర్యాప్తు జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 19 న సింగపూర్ లో అనుమానస్పదంగా ఈతకొడుతూ ఆయన మరణించిన సంగతి తెలిసిందే. జుబిన్ కు న్యాయం చేస్తామన్నారు.
