Let's talk: editor@tmv.in
అరుణాచల్‌లో ఘోరం.. లోయలో ట్రక్ పడి 18 మంది మృతి

అరుణాచల్‌లో ఘోరం.. లోయలో ట్రక్ పడి 18 మంది మృతి

Pinjari Chand
12 డిసెంబర్, 2025

ఈ నెల 8 వ తేదీన అస్సాం రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లా గిల్లాపుక్రి టీ ఎస్టేట్‌లోని ధేలాఘాట్‌ నుంచి దాదాపు 22 మంది కార్మికులు మరుసటి రోజు హాస్టల్ నిర్మాణ పనుల్లో పాల్గోనడానికి ఓ ట్రక్ లో బయల్దేరారు. దట్టమైన అడవుల్లో, ఘాట్ రోడ్లలో ప్రయాణం భయం,భయంగానే సాగుతోంది. రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆ ట్రక్కు అదుపుతప్పి 650 అడుగుల లోతులో పడిపోయింది. ఆ ఆడవిలో ఆ దారుణ ఘటనను ఇతరులకు తెలిపే వారే లేరు. ఆ ప్రమాదంలో బతికి బయటపడ్డ ఓ వ్యక్తి ఎలగోలా సైనికుల క్యాంపునకు చేరుకుని జరిగిన దుర్ఘటనను వివరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు మమ్మురంగా హెలికాప్టర్లో గాలించి, తాళ్ల సహాయంతో 18 మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం అధికారులు క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ప్రమాదం జరిగినా రెండు రోజులకు విషయం తెలియడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. పెను విషాదాన్ని మిగిల్చింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అస్సాం రాష్ట్రం తిన్సుకియా జిల్లాకు చెందిన దాదాపు 18 మంది కార్మికులు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. డిసెంబర్ 8 రాత్రి హయూలియాంగ్–చగ్లాగాం రోడ్డుపై ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు గురువారం నిర్ధారించారు. 22 మంది కార్మికులతో ప్రయాణిస్తున్న ట్రక్ నియంత్రణ కోల్పోయి సుమారు 650 అడుగుల లోతైన ఘాట్‌లో పడిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రమాద సమాచారం ఆలస్యంగా లభించడంతో సహాయక చర్యలు కూడా ఆలస్యమయ్యాయి.

ఘటన వివరాలు

ట్రక్‌లో 22 మంది అస్సాం రాష్ట్రం తిన్సుకియా జిల్లా కార్మికులు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహానం డిసెంబర్ 8 రాత్రి 650 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక్క కార్మికుడు బుధేశ్వర్ దీప్ మాత్రమే ప్రాణాలతో బయటపడి, సమీపంలోని జీఆర్ఈఎఫ్ శిబిరానికి చేరుకుని జరగిని ఘోరాన్ని తెలిపాడు. అతని సమాచారం ఆధారంగా డిసెంబర్ 10 రాత్రి నుంచి అక్కడి పరిసరాలను శోధించడం ప్రారంభించారు. ఘటనాస్థలం అత్యంత దుర్గమ ప్రాంతం కావడం, దట్టమైన అడవి, హెలికాప్టర్ నుంచి కూడా కనిపించని ప్రదేశం కావడంతో రెండు రోజుల పాటు ఎవరికీ తెలియలేదు.

సహయకచర్యలు

డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ మహేందర్ రావత్ మాట్లాడుతూ గురువారం ఉదయం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు బృందాలు, వైద్యసిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించాయి. సుమారు 200 మీటర్ల లోతులో పడి ఉన్న ట్రక్‌ను గుర్తించారు. 18 మృతదేహాలు కనిపించాయి, వాటిని బెలే రోపుల సహాయంతో పైకి తీసుకువస్తున్నారు. ఇంకా ముగ్గురు కార్మికులు కనిపించడం లేదు. ప్రమాద స్థలం అత్యంత దూరంగా ఉండడం. అడవులు దట్టంగా ఉండటం, కనెక్టివిటీ చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రమాద విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. స్థానిక ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు, అధికారులు ఎవరికీ సమాచారం చేరలేదు. ఈ ఘటనలో బతికున్న ఒక వ్యక్తి క్యాంప్‌కి చేరుకోవడంతోనే ఘటన బయటపడింది.

అస్సాం అధికారులు స్పందన

అస్సాం తిన్సుకియా డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్వప్నీల్ వివరాలను తెలుపుతూ ఉదయం 11 గంటల సమయంలో మాకు సమాచారం అందింది. తిన్సుకియా నుంచి పోలీసులను అరుణాచల్‌కు పంపించామని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

మృతులు/ గల్లంతైన వారి వివరాలు

ప్రమాదంలో మరణించినవారు, కనిపించని వారిలో 18 మంది పేర్లు ఇలా ఉన్నాయి:

రాహుల్ కుమార్, సోమిర్ దీప్, అర్జున్ కుమార్, పంకజ్ మంకీ, అజయ్ మంకీ, విజయ్ కుమార్, అభయ్ భుమిజ్, రోహిత్ మంకీ, బిరేంద్ర కుమార్, అగోర్ టాంటీ, ధీరెన్ చాత్రియా, రోజోని నాగ్, దీప్ గోవాలా, రాంసేవక్ సునా, సోనాటన్ నాగ్, సంజయ్ కుమార్, కరణ్ కుమార్, జునాష్ ముండా. ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అరుణాచల్‌లో ఘోరం.. లోయలో ట్రక్ పడి 18 మంది మృతి - Tholi Paluku