
అరావళి కొండలను రక్షించడం మన బాధ్యత: అఖిలేష్ యాదవ్
అరావళి కొండలను రక్షించాలని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు కేంద్రం అరావళి కొండల నిర్వచనాన్ని నవంబర్ 20న కేంద్ర ప్రభుత్వ నిర్వచనం ప్రకారం సుప్రీం కోర్టు అరావళి శ్రేణిలో 100 మీటర్లకంటే ఎత్తు తక్కువగా ఉన్న కొండలపై మైనింగ్ నిషేధాలు వర్తించవు అని ఆమోదించిన అనంతరం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో అఖిలేష్ యాదవ్ పోస్టు చేశారు. అరావళి కొండలను కాపాడడం, ఢిల్లీలోని భవిష్యత్తుతో సంబంధం ఉందని చెప్పారు. ఈ కొండలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి సహజ రక్షణగా పనిచేస్తాయని, వాతావరణాన్ని నియంత్రించడంలో, ప్రాణాంతక వాయువులు తగ్గించడంలో, జీవ వైవిధ్యం కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు.
అరావళి సురక్షితంగా ఉంటేనే
ప్రియమైన ఢిల్లీవాసులారా, అరావళిని రక్షిస్తినే ఢిల్లీ పచ్చగా ఉంటుంది. అరావళిని రక్షించడం ఐచ్ఛికం కాదు, అది బాధ్యత. అరావళి ప్రకృతి ఇచ్చిన వరం. అది వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. వర్షాన్ని, నీటిని లోతట్టు ప్రాంతాల్లోకి రాకుండా నియంత్రిస్తుంది. జలచరాల వైవిధ్యాన్ని కాపాడుతుంది. పక్షులు, పొడి వాతావరణం, చుట్టుపక్కల పర్యావరణం అన్ని అరావళి వల్లే సురక్షితంగా ఉంటాయి. అరావళిని కాపాడితేనే భవిష్యత్తులో మనం సురక్షితంగా శ్వాస తీసుకోవచ్చు అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే, ఉత్తర భారతదేశంలో ఢిల్లీ ప్రధాన మార్కెట్, ఆర్థిక కేంద్రంగా తన ప్రాధాన్యత కోల్పోతోంది. అందువలన సేవ్ అరావళి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గోనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా కేంద్రం పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అరావళి కొండల నిర్వచనాన్ని మార్చడం డెత్ వారెంట్ అని పేర్కొన్నారు. ఆమె ఒక జాతీయ దినపత్రికలో వ్యాసం కూడా రాశారు.
నవంబర్ 20న మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి ఆధ్వర్యంలోని ఉన్నత న్యాయస్థానం మైనింగ్‌కు సంబంధించి కేంద్రం నిర్వచనాన్ని ఆమోదించింది. కోర్టు స్థిరమైన మైనింగ్ కోసం సూచనలు ఆమోదించి, అక్రమ మైనింగ్ నివారణ చర్యలను కూడా నిర్ధేశించింది. తదుపరి, మైనింగ్ కోసం అనుమతించదగిన ప్రాంతాలు, ఎకో-సెన్సిటివ్, కన్జర్వేషన్-క్రిటికల్, రీస్టొరేషన్-ప్రాధాన్యత ప్రాంతాలను గుర్తించడం, వాతావరణ ప్రభావాల సమగ్ర విశ్లేషణ, మైనింగ్ తర్వాత పునరుద్ధరణ చర్యల వివరాలు ఉన్న మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయమని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది.
