
అమెరికా రేపుతోన్న చిచ్చు
అమెరికా చర్యలతో రష్యా-యుక్రెయిన్ యుద్ధం మరింత రక్తపాతం వైపు సాగుతోంది. రక్తం వాసనతో గాలులు నిండిపోతున్నాయి. భూమి దద్దరిల్లేలా గర్జనలు వినిపిస్తున్నాయ్. తూర్పు యూరప్ నేలలు మరింత ఎర్రగా మారుతున్నాయ్. ఆకాశం కోపంతో విరుచుకుపడబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ యుద్ధం ఇప్పుడు తుఫాను మేఘాల్లా పెరుగుతోంది. మరణ నృత్యం రాబోతుందని సమయమే గట్టిగా గుసగుసలాడుతోంది. ఎందుకంటే టోమాహాక్ అనే రాక్షస క్షిపణులను యుక్రెయిన్ చేతుల్లోకి ఇవ్వాలని అమెరికా ఆలోచిస్తోంది. ఒక్కో క్షిపణి సుమారు 10కోట్ల రూపాయల విలువను కలిగి ఉంటుంది. ఒక్కటి 1,600 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లి, లక్ష్యాన్ని ఛేదించి దహించగలదు. ఈ క్షిపణులు యుక్రెయిన్‌కు ఇవ్వాలని అభ్యర్థన వచ్చినట్టు అమెరికా ఉపాధ్యక్షుడు ప్రకటించారు. రష్యా మాత్రం దీన్ని మహాప్రళయానికి ఆహ్వాన పత్రంలా పరిగణిస్తోంది.
టోమాహాక్ అనేది సాధారణ ఆయుధం కాదు. ఇది ఆకాశంలో నిశ్శబ్దంగా పయనించి, అగ్ని సముద్రంలా భూమిని కప్పేస్తుంది. ఇది పడితే వందల భవనాలు కూలిపోతాయి, వందల గుండెలు ఆగిపోతాయి. అమెరికా నేవీ ఇది గతంలో వాడింది. అప్పుడు ఇరాక్‌లోని బగ్దాద్ ఓ రాత్రంతా మంటల్లో మునిగిపోయింది. ఇప్పుడు అదే అగ్నిశ్వాస యుక్రెయిన్ చేతుల్లోకి వస్తే రష్యా నగరాలు చీకటిగా మారిపోవచ్చు. ఒక్కో దాడి ఒక నగరాన్ని కప్పేసేంత భయంకరమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక రష్యా-యుక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. రష్యా పాత గాయాలను రగిలించి, యుక్రెయిన్‌పై దాడి చేసింది. డాన్‌బాస్ ప్రాంతంపై పట్టు కోసం రష్యా సైన్యం ముందుకు కదిలింది. కానీ మూడు సంవత్సరాలు గడిచినా ఆ యుద్ధం ముగియలేదు. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం కనీసం 14,000 పౌరులు మరణించగా, 36,000 మందికి పైగా గాయపడ్డారు. లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులయ్యారు. ప్రతి రోజు కొత్త శవపేటికలు కనిపిస్తున్నాయ్. ప్రతి గ్రామం శ్మశానంలా మారిపోయింది. ఇటు రష్యా సైన్యం కూడా ఘోర నష్టాలను అనుభవించింది. యుక్రెయిన్ చెబుతున్న లెక్కల ప్రకారం రష్యాకు ఇప్పటి వరకు 10లక్షలకు పైగా సైనికులను పోగొట్టుకుంది.
అమెరికా ఈ యుద్ధంలో నిరంతరం మద్దతు ఇస్తోంది. ఇప్పటికే వందల బిలియన్ల డాలర్ల సహాయం యుక్రెయిన్‌కు చేరింది. ట్యాంకులు, డ్రోన్లు, క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలు లాంటివి అమెరికా నుంచి ప్రవహిస్తున్నాయి. కానీ మాటల్లో మాత్రం అమెరికా శాంతి గురించి మాట్లాడుతోంది. ఇది ఒక చేత్తో కన్నీళ్లు తుడుస్తూ, మరో చేత్తో బాంబులు విసిరినట్టే. అందుకే రష్యా గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ టోమాహాక్ క్షిపణులు యుక్రెయిన్‌కు వస్తే, యుద్ధం మరింత భయంకరంగా మారుతుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెడెవ్ చెప్పారు. ఇక ఈ యుద్ధం ఇప్పుడే ఆగిపోతే మంచిది. అయితే అమెరికా చర్యలు చూస్తుంటే ఇది ఇంకా ముదురబోతోందని తెలుస్తోంది. టోమాహాక్ క్షిపణులు రక్తపు వర్షంలా కురిపిస్తే, పౌరుల గుండెలు ముక్కలైపోతాయి. ఇది ఇక సాధారణ యుద్ధం కాదు. ఇది మరణ నృత్యం, ఇది ప్రళయ గీతం, ఇది భూమిని ముక్కలుగా చేసే మిస్సైల్..! మరి చూడాలి అమెరికా ఏం చేయబోతుందో.. ఓవైపు శాంతి వచనలు పలుకుతున్న మిస్టర్ డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు యుక్రెయిన్‌కు ఈ రకమైన సాయం చేస్తారా అన్నది వెయిట్ అండ్ సీ!
