Let's talk: editor@tmv.in
అమెరికా అగ్రరాజ్య చాప్టర్ క్లోజ్ అవుతుందా - నోస్ట్రడామస్ జోస్యామా, చరిత్ర పాఠమా, ఆధునిక విశ్లేషణా

అమెరికా అగ్రరాజ్య చాప్టర్ క్లోజ్ అవుతుందా - నోస్ట్రడామస్ జోస్యామా, చరిత్ర పాఠమా, ఆధునిక విశ్లేషణా

Dr.Chokka Lingam
29 మార్చి, 2026

ప్రపంచంలో భీభత్స పరిస్థితులు ఏర్పడినప్పుడు, అప్పుడెప్పుడో ఎవరో ఓ స్వామిజీ నో, బాబాజీనో ఇలా జరుగుతుందని జోస్యం చెప్పాడని అంటుంటారు. ప్రధానంగా 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ రాసిన గూఢ పద్యాలను జరుగుతున్న సంఘటనలకు ముడిపెడుతూ వుంటారు. వాటిలో కొన్ని “తూర్పు ప్రాంతాల్లో జరిగే ఘర్షణలతో ఒక మహాశక్తి బలహీనపడుతుంది” అనే భావనను సూచిస్తున్నాయంటూ కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. నోస్ట్రాడమస్ ఏమన్నాడో మనకు తెలీదు గానీ ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధం మాత్రం అమెరికాకున్న అగ్రరాజ్యం హోదాను అంతం చేస్తుందని అంటున్నారు రే డాలియో.

ఎవరీ రే డాలియో?

రే డాలియో ప్రముఖ అమెరికన్ పెట్టుబడుల ఫండ్ మేనేజర్, ఆర్థిక విశ్లేషకుడు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద హెడ్జ్ ఫండ్‌లలో ఒకటైన బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ స్థాపకుడు. గత 500 సంవత్సరాల సామ్రాజ్యాల ఎదుగుదల-పతనాలపై ఆయన చేసిన పరిశోధనలు ప్రసిద్ధి చెందాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అప్పుల సంక్షోభాలు, అధికార శక్తి సమీకరణాలపై ఆయన అభిప్రాయాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తుంటాయి. గత 500 సంవత్సరాల సామ్రాజ్యాల ఎదుగుదల-పతనాలను అధ్యయనం చేసిన డాలియో, ప్రస్తుత హోర్ముజ్ జలసంధి పరిస్థితి అమెరికాకు 1956లో బ్రిటన్ ఎఅమెరికా అగ్రరాజ్య - నోస్ట్రడామస్ జోస్యాలు, చరిత్ర పాఠాలు, ఆధునిక విశ్లేషణలు

ప్రపంచంలో భీభత్స పరిస్థితులు ఏర్పడినప్పుడు, అప్పుడెప్పుడో ఎవరో ఓ స్వామిజీ నో, బాబాజీనో ఇలా జరుగుతుందని జోస్యం చెప్పాడని అంటుంటారు. ప్రధానంగా 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ రాసిన గూఢ పద్యాలను జరుగుతున్న సంఘటనలకు ముడిపెడుతూ వుంటారు. వాటిలో కొన్ని “తూర్పు ప్రాంతాల్లో జరిగే ఘర్షణలతో ఒక మహాశక్తి బలహీనపడుతుంది” అనే భావనను సూచిస్తున్నాయంటూ కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. నోస్ట్రాడమస్ ఏమన్నాడో మనకు తెలీదు గానీ ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధం మాత్రం అమెరికాకున్న అగ్రరాజ్యం హోదాను అంతం చేస్తుందని అంటున్నారు రే డాలియో. ఎవరీ రే డాలియో? రే డాలియో ప్రముఖ అమెరికన్ పెట్టుబడుల ఫండ్ మేనేజర్, ఆర్థిక విశ్లేషకుడు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద హెడ్జ్ ఫండ్‌లలో ఒకటైన బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ స్థాపకుడు. గత 500 సంవత్సరాల సామ్రాజ్యాల ఎదుగుదల-పతనాలపై ఆయన చేసిన పరిశోధనలు ప్రసిద్ధి చెందాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అప్పు సంక్షోభాలు, శక్తి సమీకరణాలపై ఆయన అభిప్రాయాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తుంటాయి. గత 500 సంవత్సరాల సామ్రాజ్యాల ఎదుగుదల-పతనాలను అధ్యయనం చేసిన డాలియో, ప్రస్తుత హోర్ముజ్ జలసంధి పరిస్థితి అమెరికాకు 1956లో బ్రిటన్ ఎదుర్కొన్న సూయెజ్ సంక్షోభంలాంటి కీలక పరీక్షగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. డాలియో తన విశ్లేషణను ఒకే వాక్యంలో ఇలా చెప్పారు: “అమెరికా హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోల్పోతే, అది 1956లో బ్రిటన్ సూయెజ్ కాలువను కోల్పోయిన ఘటనలాంటిదే కావచ్చు.”

ఈ పోలిక ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే 1956లో జరిగిన సూయెజ్ సంక్షోభాన్ని చూడాలి. దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటన్ ప్రపంచ రాజకీయాల్లో అగ్రశక్తిగా నిలిచింది. బ్రిటిష్ పౌండ్ ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీలలో ఒకటిగా వుండేది. సముద్ర మార్గాలపై రాయల్ నేవీ ఆధిపత్యం ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా, రష్యాలు కొత్త అగ్రరాజ్యలయ్యాయి. భారత్ వంటి దేశాలు ఇంగ్లాండు పాలన నుండి స్వతంత్రం పొందాయి. అయినప్పటికీ ప్రపంచంలో ఒక ప్రముఖ శక్తిగా మిగిలిన ఇంగ్లాండుకు ఆఖరు మంగళం పాడింది ఈజిప్టు లోని సూయెజ్ కాలువ సంఘటన.

సూయెజ్ కాలువ మధ్యధరా సముద్రాన్ని సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది. ప్రపంచ వాణిజ్యంలో పెద్ద భాగం ఈ కాలువ ద్వారానే సాగేది. 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాసర్ సూయెజ్ కాలువను జాతీయీకరించారు. “ఇది ఇప్పుడు ఈజిప్ట్‌దే” అని ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ కలిసి సైనిక చర్య ప్రారంభించాయి.కానీ సంఘటనలు ఊహించని దిశగా మలుపు తిప్పాయి. అమెరికా, రష్యా, ఐక్యరాజ్యసమితి తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. చివరకు బ్రిటన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ సంఘటన తర్వాత బ్రిటన్ ను అగ్రరాజ్యంగా ప్రపంచం గుర్తించడం మానేసింది.

దాని ప్రభావం వెంటనే కనిపించింది. బ్రిటిష్ పౌండ్ బలహీనపడింది, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారు, బ్రిటన్ కాలనీలు స్వతంత్రం కోసం వేగంగా ముందుకు సాగాయి. చరిత్రకారులు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే — సూయెజ్ సంక్షోభం బ్రిటన్‌ను కూల్చలేదు; కానీ బ్రిటన్ బలహీనమైందనే భావన ప్రపంచంలో స్థిరపడింది. అదే తర్వాతి మార్పులకు దారి తీసింది.

ఈ రోజుల్లో అదే తరహా వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రదేశం హోర్ముజ్ జలసంధి.ఇది ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తుంది.సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల చమురు రవాణా ప్రధానంగా ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. ఈ చమురు యూరప్, ఆసియా దేశాలకు చేరుతుంది. ఈదారి మూసివేయబడినా, అడ్డంకులు ఏర్పడినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది.చమురు ధరలు పెరుగుతాయి. సరఫరా సంక్షోభం వస్తుంది. పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకోవాల్సి రావచ్చు.యూరప్‌లో మరో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద హైవేలో ఒక్కటే సొరంగ మార్గం ఉండి, అన్ని ట్రక్కులు, సరుకు వాహనాలు అదే మార్గం గుండా వెళుతుంటే. ఆ సొరంగాన్ని ఎవరు నియంత్రిస్తే, సరుకుల ప్రవాహాన్ని కూడా వారు నియంత్రించినట్టే. ఇప్పుడు ఇరాన్ ఆ సొరంగానికి అడ్డంగా కూర్చుంది

హిస్టరీ రిపీట్ అవుతుందా?

రే డాలియో చేసిన పరిశోధన ప్రకారం గత ఐదు శతాబ్దాల్లో సామ్రాజ్యాల చరిత్ర చూస్తే- . ఒక సామ్రాజ్యం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు అది ప్రపంచ వాణిజ్య మార్గాలను నియంత్రిస్తుంది, బలమైన సైనిక శక్తిగా ఉంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని కరెన్సీపై నమ్మకం ఉంటుంది. కానీ కాలక్రమేణా కొత్త శక్తులు ఎదుగుతాయి. వ్యూహాత్మక వాణిజ్య మార్గాలపై సవాళ్లు మొదలవుతాయి.ఆ సవాళ్లను అగ్ర రాజ్యం విజయవంతంగా ఎదుర్కొంటే దాని ఆధిపత్యం కొనసాగుతుంది.అలా చేయలేకపోతే ప్రపంచ నమ్మకం క్రమంగా తగ్గుతుంది. మిత్రదేశాలు దూరమవుతాయి. పెట్టుబడులు వేరే చోటుకు వెళ్తాయి. ఋణభారం పెరుగుతుంది. చివరికి సామ్రాజ్య ప్రభావం క్షీణిస్తుంది. డాలియో ప్రకారం ఇదే విధంగా పోర్చుగల్, నెదర్లాండ్స్, బ్రిటన్ వంటి శక్తులు క్రమంగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయాయి.

అమెరికా ప్రస్తుత పరిస్థితి:

ప్రస్తుతం అమెరికా కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. జాతీయ అప్పు 38 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లింపులకే ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చవుతోంది. ఇక సైనిక రంగంలో కూడా గత దశాబ్దాల్లో వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు అమెరికా వ్యూహాలపై ప్రశ్నలు రేపాయి.ఇప్పుడు హోర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.

యుద్ధ కాలంలో ఆయుధాలు, ఆర్థిక శక్తితో పాటు దేశంలో ఏర్పడే‌ ప్రజా ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కూడా విజయానికి కీలకం. కొన్ని దేశాలు యుద్ధాలను తమ అస్తిత్వానికి సంబంధించిన యుద్ధాలుగా భావించి దీర్ఘకాలం పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఆర్థిక ఒత్తిడి, తరచూ జరిగే ఎన్నికలలో ప్రజాభిప్రాయం వంటి అంశాలు నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి.

ఏం జరగవచ్చు?

డాలియో విశ్లేషణ ప్రకారం అమెరికా ఈ పరిస్థితిని సమర్థంగా నియంత్రించి సముద్ర మార్గాల భద్రతను కాపాడితే డాలర్‌పై విశ్వాసం మరింత బలపడుతుంది. కానీ ఒకవేళ అమెరికా ప్రభావం బలహీనపడిందనే భావన ప్రపంచంలో ఏర్పడితే కొత్త ఆర్థిక సమీకరణాలు, ప్రత్యామ్నాయ కరెన్సీలు ముందుకు రావచ్చు. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికాకు సవాల్ విసురుతోంది.. అమెరికా డాలర్ ను కాదని, చైనా కరెన్సీ అయిన యువాన్ తో ఇరాన్ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తోంది. హోర్ముజ్ కోసం మరిన్ని దేశాలు తమ అంతర్జాతీయ వాణిజ్యాన్ని యువాన్ తో చేయవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యానికి ప్రధాన కారణం ప్రపంచ వాణిజ్యం ప్రస్తుతం అమెరికా డాలర్ లో జరగడం. దానికి గండి పడినప్పుడు అమెరికా చాప్టర్ ఆగి, కొత్త చాప్టర్ మొదలవుతుంది.

హోర్ముజ్ సంధి చారిత్రక సంధి అవుతుందా?

నోస్ట్రడామస్ సోదిని పక్కన పెడితే కూడా చరిత్ర ఒక స్పష్టమైన పాఠం చెబుతుంది ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మార్గాలు తరచూ సామ్రాజ్యాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. హోర్ముజ్ లో జరుగుతున్న పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయాలకే కాకుండా భవిష్యత్ ప్రపంచ శక్తి సమీకరణాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

అమెరికా అగ్రరాజ్య చాప్టర్ క్లోజ్ అవుతుందా - నోస్ట్రడామస్ జోస్యామా, చరిత్ర పాఠమా, ఆధునిక విశ్లేషణా - Tholi Paluku