
అమరావతిలో మొదలైన కొత్త హైకోర్టు భవనం పనులు
రాజధాని అమరావతిలో అద్భుతమైన నిర్మాణాల పర్వం మొదలైంది. నగరం మొత్తానికే తలమానికంగా నిలిచే నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులకు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ శ్రీకారం చుట్టారు. నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భవన పునాది (రాఫ్ట్ ఫౌండేషన్) పనులను ఆయన అధికారికంగా ప్రారంభించారు.
కాగా ఈ హైకోర్టు భవనాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘నార్మన్ ఫోస్టర్’ సంస్థ రూపొందించిన డిజైన్లతో నిర్మిస్తున్నారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చూపరులను ఆకట్టుకునేలా ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఇందులో మొత్తం 52 కోర్టు హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. భవన నిర్మాణం విషయానికి వస్తే.. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులు ఉంటాయి. 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉండగా, అత్యున్నతమైన చీఫ్ జస్టిస్ కోర్టు మాత్రం ఎనిమిదో అంతస్తులో ఉండనుంది.
2027 నాటికి పూర్తి
అమరావతి అభివృద్ధిలో ఇదొక కీలక మైలురాయి అని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజధాని అందాలను రెట్టింపు చేసేలా ప్రభుత్వం నిర్మిస్తున్న 7 ప్రధాన కట్టడాలలో హైకోర్టు అత్యంత కీలకమైనదని ఆయన చెప్పారు. పనులన్నీ వేగంగా పూర్తి చేసి, 2027 చివరి నాటికి ఈ అద్భుత భవనాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా 2014-2019 మధ్యకాలంలో తెదేపా ప్రభుత్వం హైకోర్టు కొంతమేర రాఫ్ట్ ఫౌండేషన్ ప్రారంభించాయి ఆతరువాత వైకాపా ప్రభుత్వం అమరావతి పనులు నెలిపివేసింది. ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఈ హైకోర్టు పనులు ప్రారంభించింది
