Let's talk: editor@tmv.in
అమ్మవారి విగ్రహం ధ్వంసం

అమ్మవారి విగ్రహం ధ్వంసం

Panthagani Anusha
23 సెప్టెంబర్, 2025

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా మొదలైన వేళ ముంబైలోని మంఖుర్డ్ ప్రాంతంలో దుర్గాదేవి విగ్రహం ధ్వంసం కావడం విగ్రహం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కాగా ఈ ఘటనలో పోలీసులు ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక మండపంలో అమ్మవారి విగ్రహాన్ని సన్నని వీధిలోంచి తీసుకెళ్తుండగా విగ్రహం చేయి విరిగిపోయింది దీంతో మరో వర్గం కావాలనే విగ్రహాన్ని ధ్వంసం చేసిందనే ఆరోపణలతో రెండు వర్గాల మధ్య తగాద నెలకొంది. ఆ గొడవ కాస్త పెరిగి హింసాత్మక ఘర్షణగా మారి, ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం దాడికి కారణమైన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు.

ఇక పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఇరుకైన వీధిలో విగ్రహాన్ని తీసుకెళ్తుండగా అనుకోకుండా విగ్రహం ధ్వంసం అయిందని, ఎవరు ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని పేర్కొన్నారు. ఇక దర్యాప్తు అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

అయితే ఇలాంటి సంఘటనలు మతపరమైన పండుగల సమయంలో జరిగితే వర్గీయ వివాదాలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల భక్తులు, స్థానికులు పరస్పరం సహకరించి శాంతి వాతావరణం కాపాడాలని, చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకూడదని విజ్ఞప్తి చేశారు. నవరాత్రి వేడుకలు భక్తి, సాంస్కృతిక ఉత్సాహంతో జరగాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అమ్మవారి విగ్రహం ధ్వంసం - Tholi Paluku