Let's talk: editor@tmv.in
అప్పుల బాధ తాళలేక హెూంగార్డు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక హెూంగార్డు ఆత్మహత్య

FL - YUGDR
4 అక్టోబర్, 2025

అప్పుల బాధ తాళలేక ఓ హెంగార్డు ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స మొబైల్ లో పనిచేస్తున్న డ్రైవర్ (హెచ్ జి 597) అప్పల నాయుడు ఇటీవల అప్పుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో అతను నివాసం వుంటున్న పెందుర్తిలోని ఇంటికి చేరుకొని అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని భార్యతో చెప్పి గదిలోకి వెళ్లి ఉరి వేసికుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే భార్య, పిల్లలు గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా ఉరి వేసుకుని వేలాడుతున్న నాయుడుని కిందకు దించి వేపగుంటల హాస్పిటల్ కి తీసికొని వెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి కేజీహెచ్ కి తీసుకొని వెళ్ళమని చెప్పడంతో వారు కేజీహెచ్ లో చేర్చారు.

అయితే కేజీహెచ్లో చికిత్స పొందుతున్న నాయుడు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కే జి హెచ్ మార్చురీకి తరలించారు. అందరితో సరదాగా కలిసిమెలిసి తిరిగే నాయుడు చనిపోయాడు అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు, హెూం గార్డ్స్ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరోజు వేతనాన్ని ఆర్థిక సహాయంగా నాయుడు కుటుంబానికి హెూంగార్డ్స్ ప్రకటించారు. సీఐ సతీష్ ఆధ్వర్యంలో పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధ తాళలేక హెూంగార్డు ఆత్మహత్య - Tholi Paluku