Let's talk: editor@tmv.in
అపార్థం విలువ ఒక ప్రాణం

అపార్థం విలువ ఒక ప్రాణం

Panthagani Anusha
29 సెప్టెంబర్, 2025

చిన్న చిన్న వివాదాలు ఎంతటి ఘోరమైన పరిణామాలకు దారితీస్తాయో తెలియజేసే ఓ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మణియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తర్ తోలా, వార్డు నంబర్ 14లో నివాసముంటున్న మొహర్రం హస్మి (40), అనే వ్యక్తి పొరుగింటి వారితో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. అయితే ఓకే చిన్న అపార్థం హస్మి మరణించడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చిన మొహర్రం హస్మీ మద్యం మత్తులో తన తల్లిని తిడుతూ ఉండగా, హస్మి మట్టాలు విన్న ఎక్కింటివారు అదే మాటలు తమ తల్లిని అవమానించేలా ఉన్నాయని, తన తల్లి పేరు చెప్పుకుంటూ హస్మి తమ తల్లిని తిడుతున్నారని అపార్థం చేసుకున్న పొరుగింటివారు మొహర్రం హస్మి వద్ద గొడవకు దిగారు. మొదట మాటల తగువుగ మొదలైన గొడవ కాస్త పెద్ద ఘర్షణకు దారితీసింది. కాగా ఆ ఘర్షణ మధ్యలో హస్మి తలపై దాడి చేయడంతో అతడు తీవ్రగాయాల పాలయ్యాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన హాష్మిని సమీపంలో ఉన్న మణియార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఓంవీర్ సింగ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక దర్యాప్తులో ఒక చిన్న అపార్థం వల్ల ఇంతటి విషాదం జరిగిందని, చిన్న మాట పెద్ద ప్రాణనష్టానికి కారణమైంది అని ఆయన పేర్కొన్నారు.ఇక మృతుడి సోదరుడు అర్మాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఘర్షణకు కారణమైన రజనీష్, మనీష్, లల్లన్, మంజు దేవి అనే నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

అపార్థం విలువ ఒక ప్రాణం - Tholi Paluku