
అనారోగ్యానికి గురైన గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
కురుపాం మండలంలో శివన్నపేట గురుకులం ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకి గురై 110 మంది విద్యార్థులు హాస్పటల్ పాలయ్యారు. పార్వతిపురం ఏరియా హాస్పిటల్ లో అలాగే గుమ్మ లక్ష్మీపురం పీహెచ్సీలో వీళ్ళని ఆరు రోజులు పాటు ఉంచడం జరిగింది. వైద్యం సరిగ్గా అందకపోవడంతో 50 మంది విద్యార్థినిలకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖలో కేజిహెచ్ హాస్పిటల్ కి తరలించారు.
కేజిహెచ్ లో ఉన్న విద్యార్థులని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, పార్వతీపురం జిల్లా కార్యదర్శి జిల్లా గంగూ నాయుడు, విశాఖ జిల్లా కమిటీ సభ్యులు సుబ్బారావు , ఎల్.జే నాయుడు, వి.వై.నాయుడు తదితరులు పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. గతంలో ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యలు అధికార యంత్రాంగానికి తెలిపామని. అయినా సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. మంచినీరు, మరుగుదొడ్లువిద్యార్థులకు సరిపడా తరగతి గదులు అదేవిధంగా బస చేసేందుకు సరిపడా గదులు, డైనింగ్ హాలు సదుపాయం లేనందువల్లనే ఇద్దరు విద్యార్థులు మరణానికి అలాగే 110 మంది విద్యార్థులు హాస్పటల్ చేరడానికి కారణం అయిందని చెప్పారు. చనిపోయిన విద్యార్థులకి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఆశ్రమ పాఠశాలలో కేజీబీవీ లో గురుకులాలలో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని వారు మండిపడ్డ్డారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేయకపోవడం వల్లే విద్యార్థులు రోగాలపాలవుతున్నారు. హెల్త్ అసిస్టెంట్లు లేరని కొన్ని సంవత్సరాలుగా హెల్త్ అసిస్టెంట్లు నియమించాలని పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఎంత ప్రమాదం జరిగిందని అన్నారు ఆశ్రమ పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్ నియమించాలి, 600 మంది కి కేవలం 10 బాత్రూమ్ లు మాత్రమే ఉన్నాయి అని కనీసం ఇప్పుడు అయినా విద్యార్థుల సంఖ్య అనుగుణం గా బాత్రూమ్ లు, మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ విద్యార్థుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇకనైనా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
