
అనాటమీ కోసం మూడు మృతదేహాలు
FL - YUGDR
20 సెప్టెంబర్, 2025
ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వన్ టౌన్ పోలీసులు బాసటగా నిలిచారు. స్టేషన్ పరిధిలో ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ముగ్గురు మృతదేహాల్ని పరిశోధనల నిమిత్తం కేజీహెచ్ అనాటమీ విభాగానికి అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బగ్బీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జీడీ బాబు, పోలీస్ సిబ్బంది శ్రీను, రామకృష్ణారెడ్డి ఇందుకోసం ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసీ) ప్రిన్సిపాల్ తో పాటు విభాగాధిపతులు మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ చొరవ కారణంగా ఇప్పటి వరకు సుమారు 15 అనాథ శవాల్ని విద్యార్థుల పరిశోధనల కోసం అప్పగించారని గుర్తు చేశారు. పోలీసుల సేవలకు ధన్యవాదాలు తెలియజేశారు.
