Let's talk: editor@tmv.in
అధికారిక లాంఛనాలతో ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు

Gaddamidi Naveen
12 నవంబర్, 2025

తెలంగాణ ప్రజల కవి, ప్రముఖ రచయిత అందెశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతోఘనంగా పూర్తయ్యాయి.ఘట్‌కేసర్‌లో నిర్వహించిన ఆయన అంతిమ సంస్కారాలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హాజరై నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రాష్ట్ర గీతం రచించిన మహానుభావుడికి గౌరవార్థం అందెశ్రీ పాడెను మోసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కవి పార్థివ దేహానికి తుది వీడ్కోలు పలికారు.

తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా,రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలను పూర్తి చేశారు.ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన నాయకులు,అందెశ్రీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గ‌త సంవ‌త్స‌రం లేఖ రాశామ‌ని,ఈసారి స్వయంగా ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేస్తా సీఎం తెలిపారు.అలాగే కేంద్ర మంత్రుల‌కు బండి సంజ‌య్,కిష‌న్ రెడ్డికి సీఎం సూచించారు.

అధికారిక లాంఛనాలతో ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు - Tholi Paluku