
అదుపు తప్పిన కారు, ఆగని విషాదం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌లో శనివారం ఉదయం ఒక భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో జిటీ రోడ్ రాకేష్ మార్గ్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆ మార్గం గుండా వస్తున్న ఓ కారు అక్కడున్న స్థానికులపైకి దూసుకు వచ్చింది.ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు.
బాధితుల వివరాల ప్రకారం, విపిన్ శర్మ (47), మీనూ ప్రజాపతి (56), కమ్‌లేశ్ (55) సావిత్రి దేవి (60) ప్రమాదానికి గురయ్యారు. ముగ్గురు మహిళలు న్యూ కోటగావ్, కోట్వాలి ప్రాంతానికి చెందినవారు. వాకింగ్ కు వచ్చిన సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడం, రోడ్ల భద్రతపై ఆందోళన కలిగించింది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు నలుగురు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు, స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుల పరిస్థితి గురించి అదేవిదంగా జరిగిన సంఘటన గురించి ఆరాతీశారు. మరోవైపు మీనూ ప్రజాపతి, సావిత్రి ఘటనా స్థలంలోనే మృతి చెందగా కమ్లేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక గాయపడిన విపిన్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, అయితే ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధావల్ జైస్వాల్ తెలిపారు.
ఘటన ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా డ్రైవర్ కారును ఘటనా స్థలంలోనే వదలి పరారైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తోంది. మరోవైపు అధికారులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ద్వారా మృతువు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో అనే వాస్తవం మరోసారి తీటా తెల్లమైంది
