
అదిలాబాద్ కోట - చారిత్రక వైభవానికి నిలయం
అదిలాబాద్ కోట, హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న ఒక గొప్ప చారిత్రక కట్టడం. దీనిని ముహమ్మద్ బీన్ తుగ్లక్ (1325–1351) కాలంలో నిర్మించారు. ఈ కోటను అప్పట్లో మహ్మదాబాద్ కోట అని పిలిచేవారు. తర్వాత కాలంలో “అదిలాబాద్” అనే పేరు ప్రాచుర్యం పొందింది. ఈ కోట, గోల్కొండ కోటకు సమీపంలో నిర్మించబడింది కాబట్టి, ప్రధాన కోటకు రక్షణగా నిలిచింది. సైనిక దాడుల సమయంలో శత్రువుల నుంచి ముందుగా ఎదుర్కొనే కంచె లాంటి స్థావరంగా నిలిచింది.
నిర్మాణ శైలి
ఈ కోట సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కోట చుట్టూ ఉన్న గోడలు చాలా బలంగా, ఎత్తుగా నిర్మించబడ్డాయి. గోడలలో రక్షణ కోసం బురుజులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా చెక్క, రాళ్లు, సున్నం వాడి నిర్మించారు. కోటలో ప్రవేశ ద్వారం అద్భుతంగా చెక్కబడి, శత్రువులు దాడి చేసే అవకాశం తక్కువగా ఉండేలా నిర్మించారు.
చరిత్ర
1325లో ముహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని నిర్మించాడు. తర్వాత కాలంలో బహ్మనీ సుల్తానులు, ఆపై గోల్కొండలోని కుతుబ్షాహీలు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కోటను ప్రధానంగా సైనిక స్థావరంగా ఉపయోగించారు. కొన్ని యుద్ధాల సమయంలో గోల్కొండ కోటను రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. శత్రువులు గోల్కొండ కోటపై దాడి చేసేముందు ముందుగా ఈ కోటను దాటాల్సివచ్చేది.
ప్రస్తుత స్థితి
నేటి రోజుల్లో కోట ఎక్కువగా శిథిలావస్థలో ఉన్నా, దాని నిర్మాణ వైభవం ఇప్పటికీ కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గోడలు, బురుజులు ఇంకా నిలిచి ఉన్నాయి. పర్యాటకులకు ఇది ఒక చారిత్రక ఆకర్షణగా ఉంది. కోట శిథిలావస్థలో ఉన్నా, చరిత్రను చెప్పే గోడలు, బురుజులు నడుస్తూ చూస్తే ఆ కాలపు సైనిక జీవన శైలిని ఊహించవచ్చు. చారిత్రక కట్టడాలు పై మక్కువ ఉన్నవారికి ఫోటోలు తీయడానికి ఇది ఒక అద్భుతమైన లొకేషన్ .
పర్యాటక ప్రాముఖ్యత
చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఇష్టపడేవారికి ఇది తప్పనిసరిగా చూడదగ్గ ప్రదేశం. గోల్కొండ కోటను చూసే పర్యాటకులు, అదిలాబాద్ కోటను కూడా సందర్శిస్తారు. ఇక్కడ నడుస్తూ చూస్తే ఆ కాలపు సైనిక క్రమశిక్షణ, నిర్మాణ ప్రతిభ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కోటలో సైనికుల నివాసాలు, గిడ్డంగులు ఉన్నట్లు గుర్తులు కనిపిస్తాయి
ఎలా చేరుకోవాలి?
కోట హైదరాబాద్ నగరంలోనే ఉంది. గోల్కొండ కోటకు చాలా దగ్గరగా ఉండటం వలన, రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరంలోని బస్ సౌకర్యం, ఆటోలు, క్యాబ్ లు లభిస్తాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) నుండి సుమారు 30 - 35 కి.మీ.సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి రోడ్డు మార్గంలో 15 నుండి 18 కి.మీ దూరంలో ఉంది. నగరంలోని బస్సులు, ఆటోలు, మెట్రో కనెక్ట్ అయిన క్యాబ్లు సులభంగా అందుబాటులో ఉంటాయి.
వసతి
కోట దగ్గర పెద్దగా వసతి గృహాలు లేవు, కానీ గోల్కొండ, హైదరాబాద్ నగరంలో అనేక హోటళ్లు, లాడ్జ్ లు, రిసార్ట్ లు లభిస్తాయి. బడ్జెట్ హోటళ్లు నుండి లగ్జరీ రిసార్ట్ ల వరకు విస్తృత సౌకర్యాలు ఉన్నాయి. కుటుంబాలతో, స్నేహితుల బృందాలతో, పర్యటన చెయ్యాలనుకునేవారికి రాకపోకలకు అనువైన వసతులు లభిస్తాయి.
చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు
గోల్కొండ కోట - ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోట (1 కి.మీ దూరం)
కుతుబ్షాహీ సమాధులు - అద్భుతమైన శిల్పకళ (3 కి.మీ
చార్మినార్ - హైదరాబాద్ ప్రతీక (10 కి.మీ
సాలార్ జంగ్ మ్యూజియం - ప్రపంచంలోని అరుదైన కళాఖండాలు (12 కి.మీ)ఇక్కడ చూపురులను ఎంతగానో ఆకర్షిస్తాయి. చరిత్ర ను కళ్ళకు కట్టినట్లు గా చూపిస్తాయి.
హుస్సేన్ సాగర్ సరస్సు - బుద్ధ విగ్రహం, బోటింగ్ (15 కి.మీ)ప్రశాంతమైన సాయంత్రం గడపడానికి అనువైన ప్రదేశం,పక్కనే ఎన్. టి. ఆర్. గార్డెన్స్, బిర్లామందిరం, ప్రత్యేక ఆకర్షణలు.
పర్యాటక సూచనలు
ఉదయం లేదా సాయంత్రం సందర్శించడం ఉత్తమం (ఎండ తక్కువగా ఉంటుంది). పాదరక్షలు బలమైనవి ధరించాలి, ఎందుకంటే రాతి మెట్లు, శిథిలాలు ఎక్కువగా ఉంటాయి . చారిత్రక స్థలం కాబట్టి ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అవసరం. ఫోటోగ్రఫీకి ఇది ఉత్తమ ప్రదేశం, కాబట్టి కెమెరా తప్పక తీసుకెళ్లాలి .అదిలాబాద్ కోట, చిన్నదైనా సైనిక చరిత్రను ప్రతిబింబించే గొప్ప నిర్మాణం. ఇది మనకు మధ్యయుగ కాలంలో కోటల ప్రాధాన్యతను, రక్షణ వ్యూహాలను, నిర్మాణ ప్రతిభను గుర్తు చేస్తుంది. చరిత్ర, వాస్తుశిల్పం, సంస్కృతి ప్రేమికులకు ఇది ఒక విలువైన పర్యాటక స్థలం.
