
అదానీ గ్రూప్కు సెబీ క్లీన్చిట్
అదానీ గ్రూప్కు భారీ ఊరట లభించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికలో ఆరోపించిన విధంగా అదానీ గ్రూప్, దాని వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఏ చట్టాలనూ ఉల్లంఘించలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్పష్టం చేసింది. 2023 జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ గ్రూప్పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలను మేనిప్యులేషన్ చేసిందని, నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేపట్టింది.
దర్యాప్తు అనంతరం, సెబీ తన నివేదికలో హిండెన్బర్గ్ ఆరోపించినట్లుగా అదానీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు డిమాండ్, సప్లై, ఇతర మార్కెట్ శక్తుల ఆధారంగానే కదిలాయని పేర్కొంది. అలాగే అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు కనీస పబ్లిక్ వాటాల నిబంధనను ఉల్లంఘించాయనే ఆరోపణలకు కూడా బలమైన ఆధారాలు దొరకలేదని సెబీ తేల్చి చెప్పింది. కొన్ని లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థల గురించి వివరాలు సేకరించేందుకు విదేశీ అధికారుల నుంచి సమాచారం కోరినట్లు, కానీ పూర్తి సమాచారం రాలేదని వివరించింది. కొన్ని సంక్లిష్టమైన అంతర్జాతీయ లావాదేవీలపై దర్యాప్తు పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుందని సెబీ తెలిపింది. అయితే, ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి చట్టపరమైన ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్ స్పందన
సెబీ క్లీన్చిట్ ఇవ్వడంపై అదానీ గ్రూప్ సంతోషం వ్యక్తం చేసింది. మొదటి నుండి తాము ఏ తప్పు చేయలేదని, అన్ని ఆరోపణలు నిరాధారమైనవి అని తాము వాదిస్తున్నామని, ఇప్పుడు సెబీ దర్యాప్తులో కూడా అదే నిరూపితమైందని గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు గౌతమ్ అదానీ కూడా ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదిక వల్ల మదుపరులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవాలు వ్యాప్తి చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. కాగా ఈ క్లీన్చిట్ తర్వాత అదానీ గ్రూప్ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో అదానీ గ్రూప్పై మళ్లీ విశ్వాసం పెరిగింది.
ఈ పరిణామం అదానీ గ్రూప్కు ఒక పెద్ద ఊరట అని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. గత రెండేళ్ల నుంచి హిండెన్బర్గ్ ఆరోపణల వల్ల గ్రూప్ మార్కెట్ విలువలో గణనీయమైన క్షీణత కనిపించింది. ఇప్పుడు సెబీ క్లీన్చిట్ ఇవ్వడంతో గ్రూప్ షేర్లు పుంజుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం దేశంలో పెట్టుబడుల వాతావరణానికి కూడా సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
