Let's talk: editor@tmv.in
అడవుల నుంచి ఆదాయాల దిశగా గిరిజన మహిళల విజయగాధ!

అడవుల నుంచి ఆదాయాల దిశగా గిరిజన మహిళల విజయగాధ!

Gaddamidi Naveen
10 నవంబర్, 2025

కొమరంభీం-అసిఫాబాద్ జిల్లా ఉత్నూర్‌కు చెందిన ఆదివాసి మహిళలు తమ సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని, “భీమ్ భాయ్ ట్రైబల్ ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీ” ద్వారా రూ.1.27 కోట్లు టర్నోవర్ సాధించి ఆదర్శంగా నిలిచారు.ఐటిడీఏ ఉత్నూర్, ట్రైకార్ మద్దతుతో ఈ మహిళలు అడవుల్లో లభించే ఇపప్పువ్వు పుష్పాన్ని ఉపయోగించి పుష్టికరమైన ఇపప్పువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ప్రమాణాలకు అనుగుణంగా పల్లీలు, నువ్వులు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, సన్‌ఫ్లవర్ నూనెతో తయారు చేస్తున్నారు.

మహారాష్ట్రలోని యావత్మాల్‌లో 12 మంది మహిళలు ప్రత్యేక శిక్షణ పొందారు.రూ.40 లక్షల వ్యయంతో యూనిట్ ఏర్పాటు చేయగా, అందులో 60 శాతం ట్రైకార్ సబ్సిడీ లభించింది.వీరు తయారుచేసే లడ్డూలను గిరిజన పోషణ్ మిత్ర పథకం కింద 77 గిరిజన పాఠశాలలకు నెలకు 2,300 కిలోలు సరఫరా చేస్తున్నారు.అలాగే, శిల్పారామం, బాలాపూర్ స్టాళ్లలో కిలో రూ.360 చొప్పున విక్రయిస్తున్నారు. 100కు పైగా గిరిజన కుటుంబాలు ఇపప్పువ్వు సేకరణ, ప్రాసెసింగ్‌లో పాల్గొని ఉపాధి పొందుతున్నారు.గ్రామీణ మహిళల ఆదాయాలు పెరగడమే కాకుండా ఆర్థిక అవగాహన కూడా పెరుగుతోంది.ప్రతి కుటుంబం నెలకు సగటుగా 8,000 నుంచి 12,000 వరకు ఆదాయం పొందుతోంది. ఇది ముందుగా వారికి ఉన్న అస్థిర అజీర్తి ఆధారిత జీవనోపాధిపై స్థిరమైన మార్పు తీసుకువచ్చింది.

వారి కృషిని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రశంసించగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా “మన్ కీ బాత్”లో ఈ విజయగాధను ప్రస్తావించారు.రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, గిరిజన మహిళా సాధికారత దిశగా ఇది ఒక విజయవంతమైన మోడల్‌గా నిలుస్తోంది.

యవత్మాల్‌లో శిక్షణ – గిరిజన మహిళల విజయయాత్రకు బాట

కొమరంభీం–అసిఫాబాద్ జిల్లా ఉత్నూర్‌కు చెందిన 12 మంది గిరిజన మహిళల జీవితాల్లో మలుపు తీసుకొచ్చింది మహారాష్ట్రలోని యవత్మాల్ శిక్షణా కార్యక్రమం. భీమ్ భాయ్ గిరిజన మహిళా సహకార సంఘం ప్రారంభానికి ముందు వీరికి ఆహార ప్రాసెసింగ్, శుభ్రతా ప్రమాణాలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్, న్యూట్రిషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణను యవత్మాల్‌లోని అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉత్నూర్ సమన్వయంతో నిర్వహించారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో మహిళలకు హ్యాండ్స్-ఆన్ ప్రాక్టికల్ ప్రాక్టీస్ ఇచ్చి, ఇపప్పువ్వు పుష్పం నుంచి పుష్టికర లడ్డూ తయారీ వరకు ప్రతి దశను వివరించారు.శిక్షణ అనంతరం మహిళలు ఉత్నూర్‌కు తిరిగి వెళ్లి, రూ.40 లక్షల వ్యయంతో “భీమ్ భాయ్ ట్రైబల్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ”ని స్థాపించారు. ప్రస్తుతం ఈ యూనిట్ నెలకు 2,300 కిలోల లడ్డూలను తయారు చేస్తోంది.ఈ ప్రయత్నం వల్ల 100కి పైగా గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతూ, “అడవుల నుంచి ఆదాయాల దిశగా” అనే అభివృద్ధి మార్గం సాకారం అవుతోంది.