Let's talk: editor@tmv.in
అట్టుడికిన పెదగంట్యాడ

అట్టుడికిన పెదగంట్యాడ

FL - YUGDR
9 అక్టోబర్, 2025

విశాఖపట్నం శివారు‌లోని పారిశ్రామిక ప్రాంతం పెదగంట్యాడ నిత్య నిరసనలు, ఆందోళనతో అట్టుడికి పోతోంది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ‌కి వ్యతిరేకంగా జనం పిడికిలి బిగించారు. బుధవారం అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ లో వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న ఆందోళనకారులు టెంట్లు పీకేశారు. బ్యారికెట్లు ధ్వంసం చేశారు. వారిని అదుపు చేయటం సాధ్యం కాక పోలీసులే చేతులెత్తేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆందోళనలకు అడ్డా

నిర్వాసిత, కార్మిక పోరాటాలకు వేదికైన పెదగంట్యాడ ఇప్పుడు కాలుష్య భూతంపై సమర శంఘారావం పూరిస్తోంది. జనసాంధ్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతం పెదగంట్యాడ ప్రజల నెత్తిన అంబుజా సిమ్మెంట్ అనారోగ్య కట్టడాన్ని అడ్డుకోడానికి అన్ని వర్గాలూ బుధవారం ఏకమయ్యాయి. ప్రజాభీష్టానికి ఇప్పుడు అధికార కూటమి పార్టీల నాయకులు సంకట స్థితి లో పడ్డారు. సమీపంలో రామన్న స్థానిక ఎన్నికలు వీరి గుండెల్లో గుబులు నింపాయి. ఉక్కు ప్రవేటీకరణను అడ్డుకోక పోవడంతో అపఖ్యాతిని కూటిమి నాయకులు మూటగట్టుకుంటున్నారు. ఇదే సమయంలో అంబుజా సిమ్మెంట్ కాలుష్య బూతం ప్రజల నెత్తిన రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోక పోతే రాజకీయంగా తమకు మనుగడ ఉండదన్న భయం కూటమి నాయకుల్ని వెంటాడుతోంది.

అక్కడ అన్ని కాలుష్య కారక పరిశ్రమలే

పెదగంట్యాడ పట్టణ ప్రజలకు కాలుష్య కష్టాలు తెలిసినవే. ఒక వైపు గంగవరం పోర్ట్ కాలుష్యం, మరొక వైపు హిందుజా పవర్స్టాంట్ బొగ్గు కాలుష్యం అంతకు మించి పారిశ్రామిక వాడలలో నుంచి వస్తున్న కాలుష్య భూతం ప్రజల్ని పోరాటాలవైపు నడిపిస్తుంది. దీంతో వాడవాడలా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. అధికార, ప్రతిపక్ష, వామపక్ష తేడాలు లేకుండా అంబుజా సిమ్మెంట్ బుధవారం పెదగంట్యాడ లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డు కొని తమ నిరసనను మరోమారు తెలియజేశారు. కూటమి కార్పొరేటర్లు సయితం ప్రజల వెంటే తాముంటామంటూ ప్రకటించారు.

పెదగంట్యాడ ప్రాంతం మహావిశాఖలో భాగమైన పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. పట్టణ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువుగా ఉన్న ప్రాంతంలో కేవలం భూమి అందుబాటులో ఉందన్న కారణంగా ప్రజా రోగ్యాలను సయితం లెక్క చేయకుండా సిమ్మెంట్ ఫ్యాక్టరీ అనుమతివ్వదం ప్రజల్ని ఆందోళన వైపు పురిగొల్పుతోంది. ఫ్యాక్టరీలు పెడితే ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అమాంతం పెరిగిపోతాయని చెబుతున్న లెక్కలు అసత్యాల మూటలన్న సంగతి ఇక్కడి ప్రజలకు తెలిసింది. గంగవరం పోర్ట్ ఆదానీ చేతికొచ్చిన తర్వాత 2 వేల మందికి పైగా నిర్వాసితలను వివిధ కారణాలతో తొలగించారు. పెదగంట్యాడ పరిసర గ్రామాల సిమ్మెంట్ కాలుష్య భూతం విళయతాండం చేయనుంది. ఇక ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలకు విలువ ఇస్తారో లేదో వేచి చూడాలి.

ప్రజాభిప్రాయ సేకరణకు నిరసన సెగ

అదాని సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్న ప్రాంతంలో అంబుజా సిమెంట్ పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అదాని అంబుజా సిమెంట్ కంపెనీ ని సాగరతీరం, జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల గంగవరం, పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం, సింధియా, శ్రీహరిపురం వరకు గల విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని సుమారు పది లక్షల మంది ప్రజలు అనారోగ్యాల పాలవుతారని తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల గాలి, నీరు, భూగర్భ జలాలు కలుషితనుపుతాయని, శబ్ద కాలుష్యం పెరుగుతుందని వివరించారు. భారీ వాహన రాకపోకలు పెరిగి ప్రమాదాలు జరిగి

జరగబోయే ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశం సమయంలో ఉక్కు పెద్ద ఎత్తున వీధుల్లోకి దిగారు. ఉక్కు, నిర్వాసితుల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయా సేకరణ కేంద్రం ప్రధాన ద్వారం ఎదుట ప్రజా అభిప్రాయా సేకరణ రద్దు చేయాలి. గో బ్యాక్ అదాని, ప్రజల ప్రాణాలతో ఆటలు ఆపాలి అనే నినాదాలతో వాతావరణం మార్మోగింది. ప్లాకార్డులు, బేనర్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక మా ఊరు కాలుష్య కూపంగా మారనీయం, ఉక్కు కర్మాగారం పేరిట మమ్మల్ని ఇళ్ల నుంచి వేటాడారు. ఇప్పుడు సిమెంట్ పేరుతో మళ్లీ బతుకు తినేస్తున్నారు అని అవేదనతో నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే కార్పొరేట్ లాభాలు ముఖ్యమా? ప్రభుత్వం మా గళం వినాలి, ప్రజా అభిప్రాయా సేకరణ పేరుతో అధికార యంత్రాంగం ప్రజల భావాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభ్యంతరాలను పక్కనపెట్టి అంబుజా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుందనే అభిప్రాయం విస్తరిస్తోంది. పర్యావరణవేత్తలు కూడా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు.

ఉక్కు నిర్వాసితుల ఆగ్రహ జ్వాలలు

అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పై పెదగంట్యాడ ప్రాంత ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉద్ధృతమైంది.

ఈ ఫ్యాక్టరీతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని బుధవారం ఆందోళనకారులు హెచ్చరించారు. ప్రజా అభిప్రాయా సేకరణ కాదు ప్రజా నిరసన సేకరణ జరుగుతోంది అని వ్యంగ్యంగా పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం పెదగంట్యాడ ప్రాంతం ఆదాని వ్యతిరేక నినాదాలతో మార్మోగుతోంది. ప్రజలు ఒక్కసారిగా ఏకమై, అంబుజా కాదు ఆమోజా కాదు! అంటూ తమ అసంతృప్తిని గళమెత్తి వెల్లడిస్తున్నారు. ప్రజలు కోరుకుంటున్నది ఒకటే అభివృద్ధి పేరుతో నాశనం కాదు, బతుకులు నిలబెట్టి నిర్ణయం కావాలని, మా ఊరు కాలుష్యం కాదు, జీవనధం కావాలి ఇదే పెదగంట్యాడ గళం అని హెచ్చరించారు.

అట్టుడికిన పెదగంట్యాడ - Tholi Paluku