
అక్రిడిటేషన్, మీడియా కార్డులలో ఏ తేడా లేదు: మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టుల సంక్షేమం, సౌకర్యాలను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులందరికీ సమాన హక్కులు ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అక్రెడిటేషన్ కార్డుల మధ్య ఎలాంటి భేదం లేనని స్పష్టంచేశారు. అక్రెడిటేషన్ కార్డు పొందిన వారికి ఇచ్చే అన్ని సౌకర్యాలు మీడియా కార్డు కలిగిన వారికీ సమానంగా వర్తిస్తాయని ఆయన తెలిపారు.
ఈ అంశంపై మంత్రి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వానికి జర్నలిస్టులను విభజించే ఏ విధమైన ఉద్దేశం లేదని, నిజమైన అర్హత కలిగిన జర్నలిస్టులకే ప్రభుత్వం మద్దతు ఇవ్వనున్నట్లు తెలియజేశారు.ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు ఇచ్చే అన్ని ప్రయోజనాలు మీడియా కార్డుదారులకూ వర్తిస్తాయని స్పష్టం చేశారు.
అలాగే, డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు అభ్యంతరాలు, సందేహాలు చేసేందుకు స్పష్టత కోసం జీ.ఓ. 252లో అవసరమైన మార్పులు, సవరణలు లిఖితపూర్వకంగా చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కొంతమంది అపోహలు వ్యాప్తి చేస్తుండటం వల్ల జర్నలిస్టులు ఆందోళన చెందకూడదు. ఏ విధమైన పక్షపాతం లేదు. అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన, నిజమైన జర్నలిస్టులకు వర్తిస్తాయని. నేను మీతో ఉన్నాను, అని మంత్రి భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం అక్రిడిటేషన్ కార్డులు అత్యధిక సంఖ్యలో జారీ చేసే రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు సంఘాలతో, ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకూ ఆహ్వానం ఇచ్చి, వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జర్నలిస్టుల సంక్షేమానికి మరింత ప్రయోజనకరంగా మార్పులు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల మధ్య సమానత్వాన్ని పెంపొందించడమే కాకుండా, నిజమైన, అర్హులైన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
