Let's talk: editor@tmv.in
అక్రమ కేసులకు భయపడేది లేదు: ధర్మాన కృష్ణదాస్

అక్రమ కేసులకు భయపడేది లేదు: ధర్మాన కృష్ణదాస్

Gaddamidi Naveen
25 జులై, 2026

శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు శుక్రవారం ములాఖాత్‌లో కలిశారు. మాజీ ఉపముఖ్యమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, శ్రీకాకుళం జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు జైలులో అప్పలరాజుతో భేటీ అయి ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులకు ఎవరూ భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని, అప్పలరాజు కుటుంబానికి పార్టీ అధిష్టానం, కార్యకర్తలు సంపూర్ణంగా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ ములాఖాత్ కార్యక్రమంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, పొందర కూరకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజపు అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షుడు బగ్గు రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు కె.సి.హెచ్. గుప్తా, ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, జెడ్పీ వైస్ చైర్మన్ పాలిన శ్రీనివాస్ పాల్గొ్న్నారు. మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని అప్పలరాజుకు తమ మద్దతు తెలిపారు.