Let's talk: editor@tmv.in
అక్టోబర్‌లోపు వ్యర్థాలను తొలగిస్తాం: మంత్రి నారాయణ

అక్టోబర్‌లోపు వ్యర్థాలను తొలగిస్తాం: మంత్రి నారాయణ

Pinjari Chand
15 ఆగస్టు, 2026

రాష్ట్రంలో పేరుకుపోయిన లెగసీ(చాలా కాలంగా పేరుకుపోయిన) వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. రాజమహేంద్రవరంలోని లెగసీ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యేలు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసుతో కలిసి పరిశీలించిన సందర్భంగా అధికారులు, సంబంధిత సిబ్బందితో వ్యర్థాల నిర్వహణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 155 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలు ఉండగా.. ఇప్పటివరకు 85 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు. మిగిలిన 70 లక్షల టన్నుల వ్యర్థాలను అక్టోబర్‌ నాటికి పూర్తిగా తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఆరు నగరాల్లో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు

వ్యర్థాల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని ఆరు నగరాల్లో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో పెద్దాపురంలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌ కూడా ఉంది. ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం నగరంలో సేకరించే వ్యర్థాలను అక్కడ శాస్త్రీయంగా ప్రాసెస్‌ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో లెగసీ వ్యర్థాల తొలగింపుతో పాటు ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణతో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.