Let's talk: editor@tmv.in
అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపు - ఏపి లో అభినందనల వెల్లువ

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపు - ఏపి లో అభినందనల వెల్లువ

Dantu Vijaya Lakshmi Prasanna
25 నవంబర్, 2025

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో ప్రశంసల జల్లు కురిపించారు. మొదటిసారి జరిగిన అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు వారి అద్భుతమైన ప్రదర్శనకు భారీ అభినందనలు. వారి పట్టుదల, దృఢ సంకల్పం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. వారు మన దేశానికి మరిన్ని అవార్డులు గెలిచి, మనందరినీ గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఇప్పుడే విన్నాను, 15 ఏళ్ల పంగి కరుణ కుమారి అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతదేశానికి అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె అపారమైన కృషికి హృదయపూర్వక అభినందనలు అన్నారు.

ఇంతేకాకుండా, ఆమె విశాఖపట్నం బ్లైండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి వచ్చిందట, ఇది ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ వార్త నా రోజును నిజంగా సంతోషపరిచింది. ఆమె భవిష్యత్తు ప్రయత్నాలన్నింటిలోనూ మా పూర్తి మద్దతు ఉంటుంది. ఆమె కలలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నా అన్నారు.

దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి స్పందిస్తూ..

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై రాష్ట్ర దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఆయన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.....

ఫైనల్‌లో నేపాల్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు. జట్టు సభ్యుల సమిష్టి కృషి, అకుంఠిత దీక్ష, పట్టుదలతో విజయం సాధించారు.ఈ మ్యాచ్ లో 42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖలోని ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పంగి కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. కరుణ కుమారికి సహకరించిన పాఠశాల సిబ్బందికి అభినందనలు. కరుణ కుమారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి అన్ని విధాల ప్రోత్సహించాం. ఈ మ్యాచ్ లో కరుణకుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణం. విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించి వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందనేదానికి ఇదే నిదర్శమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

పంగి కరుణ కుమారి: భారత మహిళల అంధుల టీ20 ప్రపంచ కప్ విజేత

15 ఏళ్ల పంగి కరుణ కుమారిని పరిచయం చేస్తున్నాం, ఈమె భారతదేశ అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజయంలో ముఖ్య తార. విశాఖపట్నం అంధుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన ఈ ప్రతిభావంతులైన క్రికెటర్ నేపాల్‌పై 42 కీలక పరుగులు చేసి, భారత్‌ను విజయపథంలో నడిపించింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామంలో పెరిగిన ఆమె విజయం, ఆమె యొక్క అచంచలమైన స్ఫూర్తికి, పట్టుదలకు నిదర్శనం. మనమందరం ఆమెను చూసి గర్వపడుతున్నాం అంటూ ఏపి ఐటి మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* *స్పందిస్తూ …

ఫైనల్‌లో నేపాల్‌పై అద్భుత విజయంతో జయకేతనం ఎగురవేసిన టీం ఇండియాకు శుభాకాంక్షలు. మహిళల అసాధారణ ప్రతిభ దేశానికి గర్వకారణం నిలిచింది. ప్రతికూలతలను జయించి చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు పోరాటపటిమ, సామర్థ్యం అందరికి ఆదర్శం అన్నారు. క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్‌ విజయం యువతకు స్ఫూర్తి, క్రీడల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం పారా గేమ్స్‌తో పాటు బదిరుల, అంధుల క్రీడలను మ‌రింత ప్రోత్సహించేందుకు శ్ర‌ద్ధ వహిస్తుంది అన్నారు.

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపు - ఏపి లో అభినందనల వెల్లువ - Tholi Paluku