Let's talk: editor@tmv.in
అంగారకుడిపై జీవం ఉన్నట్లు బలమైన సంకేతాలు: నాసా

అంగారకుడిపై జీవం ఉన్నట్లు బలమైన సంకేతాలు: నాసా

Dantu Vijaya Lakshmi Prasanna
2 డిసెంబర్, 2025

నాసా కొత్త అధ్యయనం ప్రకారం అంగారక గ్రహంపై గతంలో జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు, పురాతన సూక్ష్మజీవుల ప్రక్రియలకు సంబంధించిన సంకేతాలు ఉన్నట్లు తెలుస్తోందని, ఈ పరిశోధనకు ఇంపీరియల్ శాస్త్రవేత్తలు కీలకమైన సమాచారం అందించారని ఒక ప్రకటనలో నాసా పేర్కొంది.

నాసా నేతృత్వంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ నుండి కీలక విశ్లేషణను కలిగి ఉన్న ఈ పని, అంగారక గ్రహంపై ఉన్న శిలలలో అనేక రకాల ఖనిజాలు, సేంద్రీయ పదార్థాలను కనుగొంది. ఇవి ఒకప్పుడు నివాసయోగ్యమైన పరిస్థితులు, అరుణ గ్రహంపై సంభావ్య జీవసంబంధమైన ప్రక్రియల యొక్క పురాతన చరిత్రను సూచిస్తున్నాయి.

ఇంపీరియల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి పరిశోధకులతో కూడిన అంతర్జాతీయ బృందం, అంగారకుడిపై ఉన్న జెజెరో క్రేటర్ లోని 'బ్రైట్ ఏంజిల్' అని పిలవబడే ఈ భౌగోళిక లక్షణాలు సేంద్రీయ కర్బనంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయని, గత జీవానికి సంకేతంగా బలమైన 'పొటెన్షియల్ బయోసిగ్నేచర్' గా ఉండవచ్చని నాసా ప్రతిపాదించింది.

ఇఎస్ఇ లో ఎర్త్ సైన్స్ ప్రొఫెసర్ ఇంపీరియల్ గ్లోబల్ ఇండియా అకడమిక్ కో-డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా మాట్లాడుతూ, "ఇది జీవ ఉనికి సంకేతం చాలా ఉత్తేజకరమైన ఆవిష్కరణ, అయితే దీని అర్థం మేము అంగారకుడిపై జీవాన్ని కనుగొన్నట్లు కాదు. జీవసంబంధమైన ప్రక్రియలు ఇందులో పాల్గొన్నాయో లేదో నిజంగా నిర్ధారించడానికి మేము ఇప్పుడు భూమిపై ఈ రాతి నమూనాను విశ్లేషించవలసి ఉంది."అన్నారు.

నాసా యొక్క మార్స్ 2020 మిషన్‌లో కీలక భాగం అయిన పర్సెవరెన్స్ రోవర్, 2021 నుండి 45 కిలోమీటర్ల వెడల్పు ఉన్న జెజెరో క్రేటర్‌ను అన్వేషిస్తోంది. ఈ ప్రాంతం ఒకప్పుడు భారీ సరస్సు, నదీ డెల్టాను కలిగి ఉంది. ఇవి గత జీవం యొక్క సంకేతాల కోసం అన్వేషణకు ప్రధాన లక్ష్యాలుగా పరిగణించబడే వాతావరణాలు అన్నారు.

భూమికి తిరిగి తీసుకువచ్చి వివరంగా విశ్లేషించడానికి ఎంచుకున్న రాళ్ళు, నేల నమూనాలను సేకరించి నిల్వ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. నేచర్ లో ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనం, క్రేటర్‌లోని 'బ్రైట్ ఏంజిల్' అని పిలవబడే స్పష్టంగా లేత రంగులో ఉన్న ఒక ప్రాంతంపై దృష్టి పెడుతుంది. ఇది జెజెరో సరస్సుకి నీటిని అందించిన పురాతన నదీ లోయలో ఉందన్నారు.

నరేత్వా వ్యాలీస్ అని పిలువబడే లోయ గుండా ప్రయాణిస్తున్నప్పుడు, పర్సెవరెన్స్ చిక్కని, సన్నని రేణువులు కలిగిన బురద మట్టితో కూడిన శిలలు, బురదతో కూడిన కాంగ్లోమెరేట్‌ల శ్రేణిని గుర్తించింది.

ఇక్కడ, ఇది ప్లానెటరీ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ ఎక్స్-రే లిథోకెమిస్ట్రీ, స్కానింగ్ హాబిటబుల్ ఎన్విరాన్‌మెంట్స్ విత్ రామన్ & లూమినెసెన్స్ ఫర్ ఆర్గానిక్స్ & కెమికల్స్ వంటి పరికరాలను ఉపయోగించి ఈ శిలలను వివరంగా విశ్లేషించిందన్నారు.

బ్రైట్ ఏంజిల్ వద్ద వివిధ రకాల అవక్షేప శిలల రకాలు, పంపిణీని మ్యాప్ చేయడం ద్వారా, ఇఎస్ఇ పరిశోధకులు (ప్రొఫెసర్ గుప్తా, యుకె స్పేస్ ఏజెన్సీచే నిధులు పొందిన ఇఎస్ఇ లోని రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ రాబర్ట్ బార్న్స్ సహా) ఈ బురద మట్టి శిలలు నిక్షిప్తమైన వాతావరణాన్ని పునర్నిర్మించగలిగారు.

వారి విశ్లేషణ సరస్సు అంచు, సరస్సు అడుగు భాగం యొక్క వాతావరణాన్ని సూచించే అవక్షేప నిర్మాణాలను, ఆకృతిని వెల్లడించింది. ఇందులో సిలికా, క్లేస్ (బంకమట్టి) వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న కూర్పు ఉందని, ఇది నదిలో కనిపించే పరిస్థితికి వ్యతిరేకమైనదని, ఇక్కడ వేగంగా కదిలే నీరు ఈ చిన్న కణాలను తీసుకుపోతుందని తెలుపుతుంది. ఇది ఆశ్చర్యకరమైన నిర్ధారణకు దారితీసిందని ఒక నదీ లోయ అడుగున సరస్సు నిక్షేపాలను కనుగొన్నారని తెలుపుతుంది.

ఇఎస్ఇ లో పి.ఎచ్ డి పరిశోధకుడు, నాసా పర్సెవరెన్స్ బృందంతో సహకరించే శాస్త్రవేత్త అయిన సహ రచయిత అలెక్స్ జోన్స్, పురాతన సరస్సు వాతావరణంపై వివరంగా విశ్లేషణ చేశారు. ఆయన మాట్లాడుతూ: "ఇది అసాధారణం అయినప్పటికీ చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే నరేత్వా వ్యాలీస్‌లో అలాంటి నిక్షేపాలను మేము ఆశించలేదు. మా అవక్షేప శాస్త్ర, స్తర శాస్త్ర పరిశోధన ఏమి సూచించిందంటే, గతంలో తక్కువ శక్తి కలిగిన సరస్సు వాతావరణం ఉండేదని, మిషన్ కోసం మేము వెతుకుతున్న నివాసయోగ్యమైన వాతావరణం సరిగ్గా అదే."అని అన్నారు.

ఈ నూతన ఆవిష్కరణ జెజెరో క్రేటర్ చరిత్రలో ఈ లోయ మొత్తం నీటితో నిండిఉన్న, ఈ నివాసయోగ్యమైన సరస్సు ఏర్పడటానికి దారితీసిన ఒక కాలాన్ని సూచించవచ్చు.

అంగారకుడిపై జీవం ఉన్నట్లు బలమైన సంకేతాలు: నాసా - Tholi Paluku